తారతమ్యం..

అభిమానించడం ధ్వేషించడం ఆస్వాధించడం
ఇరువురిలో సమాన స్థాయిలో ఉన్నప్పుడు 
స్త్రీలు మాత్రమే జాతులుగా విభజించబడడం
పురుషుడు ఆమెలోని నాణ్యతలు ఎంచడం..
ఎంత వరకూ సబబో నాకు అర్థంకానే కాదు!

పద్మినీ జాతిలో శుభలక్షణాలు ఉన్నాయనడం  
మురిపించి మరిపించి మెప్పించేదామైనప్పుడు
ఆమెకు సరైన జోడి పురుషులలో లేకపోవడం  
పైగా పద్మినీజాతి స్త్రీ కావాలని కోరుకోవడం..
ఎంతైనా ఇది న్యాయ సంబంధిత కోరిక కాదు!

చిత్రిణీ జాతి స్త్రీలు అందచందాలు చిందించడం
ఆకర్షించడం ఆమెకే చెల్లును అనుకున్నప్పుడు
తిరిగి ఆకట్టుకునే మగమహారాజులు కొరవడడం        
స్థిరచిత్తం లేని ఆమెని చూసి చొంగ కార్చడం..     
మగ అహానికిలా ముసుగేయడం మంచిదికాదు!

శంఖినీ మగువలు కస్సుబుస్సుతో చిర్రుమనడం
కుటిల స్వభావంతో కర్కశంగా ప్రవర్తించినప్పుడు
వీరిని ప్రేమించడం కోరి కయ్యానికి కాలుదువ్వడం       
ఏదో కోరి అనవసర ఆసక్తితో అర్హులు చాచడం..      
వివేకుల నాగరికత్వపు చత్వారం అస్సలు కాదు!

హస్తినిజాతి ఆడది నల్లగా అధికబరువు ఉండడం  
మెచ్చని పుంగవులు వంకల కోసం వెతికినప్పుడు  
ఆకార హొయలు ఆమెకేనని గేలిచేసి మాట్లాడడం
అంతరంగ అందాన్ని చూడలేని అంధత్వ లక్షణం..
అలాంటి మహోన్నతుడినందుంది మగతనం కాదు!           
    

19 comments:

  1. మరోసారి మగవారిని తిడుతూ పొగుడుతూ..

    ReplyDelete
  2. అదేంటండీ ఆడవారు కూడా మగవారిని విడగొట్టి విబేధాలు సృష్టించి ఆనందిస్తార
    అయినా మగవారిలో రెండువర్గాలే...ధనవంతుడు దరిద్రుడు ఇంకా వేరెవరితో పనిలేదు ఆడవారికి!

    ReplyDelete
  3. అర్పితగారూ అంతలా మగవారి పై కక్ష కట్టినారు?
    ఏల?
    ఎందువలన?
    ప్రకృతి అందాలుగా భావించి స్త్రీలను చేస్తున్నాము.

    ReplyDelete
  4. స్త్రీ జాతులని పోల్చిన మగవాడి బ్రతుకు బస్టాండ్ అవుతుందని విడమరచి చెప్పారు.

    ReplyDelete
  5. ఎంత గొప్పవారైనా స్త్రీ విషయం వచ్చేటప్పటికి, ఒకే విధంగా ఆలోచిస్తారు ఇది సత్యం.
    ఆలోచించి అక్షరాల్లో రాసుకోవడమే మా వంతు మాడం గారు. ఆచరణలోకి వచ్చేస్రికి ఆడవారిదే పై చేయి.

    ReplyDelete
  6. మరో షాక్ పోస్ట్ పెట్టి మగవారిని ఆడిపోసుకోవడం అన్యాయం పద్మార్పితజీ.

    ReplyDelete
  7. అంతరంగ అందాన్ని చూడలేని అంధత్వ లక్షణం..కొత్తదనం

    ReplyDelete
  8. స్త్రీ వారి జాతుల విశ్లేషణ సమాజంలో జరిగే వాస్తవ సంఘటనలని వస్తువులుగా తీసుకొని పదునైన వాక్యాలతో అల్లిన కవితాంశం బాగుంది కానీ ఏదో అసంపూర్తిగా ముగించావు అనిపిస్తుంది.

    ReplyDelete
  9. స్త్రీ అటువైపు వెళుతోందని తెలిసిన ప్రతీ పురుషుడు ఆమె వంక ఓసారి చూడ్డం సహజం. ఇందుకు ఆమె అందంగానే ఉండాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతిపరంగా పురుషుల సహజాతం. పురుషుల్లో స్త్రీల పట్ల ఆసక్తి, స్త్రీ గురించీ ఆలోచించటమన్నది జీవపరిణామంలో అబ్బిన లక్షణంగా చెప్పుకోవచ్చు. అంత మాత్రాన్న అదేదో పెద్ద నేరం అన్నట్లు చేసి ధూషించడం తప్పు అనుకుంటాను పద్మార్పితగారు.

    ReplyDelete
  10. ఆడవారి జాతులని అక్షరసేద్యం చేసారు కదా!

    ReplyDelete
  11. ఆనాడు స్త్రీ జాతి ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్భయంగా పోరాడిన సాహితీవేత్త గురుజాడ అప్పారావుగారు అయితే నేడు స్త్రీలను జాతులగా విభజించారని విజృంభించారు మీరు...బహుపరాక్!

    ReplyDelete
  12. ఏ జాతి స్త్రీ అయినా పురుషులని ఆకర్షించే విధంగానే కనపడుతుంది. ప్రకృతి వారం.

    ReplyDelete
  13. పద్మినీ
    చిత్రిణీ
    శంకిణీ
    హస్తిణీ
    హాహాహా

    ReplyDelete
  14. స్త్రీజాతులే కాదు స్త్రీ ఎప్పుడూ ఒక చర్చనీయాంశమే.

    ReplyDelete
  15. స్త్రీ సమస్యల పై శంఖారావం పూరించారు అనుకుంటే మరోలా సీన్ చూపించారు.

    ReplyDelete
  16. స్త్ర్రీ అపురూపం గౌరవప్రదం.

    ReplyDelete
  17. నాకు తెలిసి మగవారు స్త్రీలను జాతులుగా విభజించి చూడరు..అసలు చాలామందికి ఈ జాతుల విషయమే తెలియదు.అందానికి ప్రాముఖ్యతనిస్తారన్నది నిజం..
    మనసుకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని నా అభిప్రాయం..భర్త అందంగా లేడనే ఒకే ఒక్క కారణంతో దారి తప్పుతున్న మగువలనూ చూస్తున్నాం సమాజంలో మరి ఇది ఏ జాతి లక్షణం పద్మార్పిత గారూ

    ReplyDelete
  18. వారి వారి దృష్టి కోణాన్నిబట్టి మారుతుంది.

    ReplyDelete
  19. మగాణ్ణి ఏకడంలో మీరు దిట్ట

    ReplyDelete