మదిరొద..

ఎప్పుడో ఆవిరైపోయాయి అనుకున్నా కన్నీళ్ళు
మసకబడ్డ కళ్ళను తడిమితే తడిసాయి చేతులు
భావాలను ఏమార్చి నవ్వడం సులభమేం కాదు
విరిగిన మనసును అతికినా కనబడతాయి గీతలు!

నా రక్తంతోనే తడిసారి ఎర్రబడ్డాయి నా చేతివేళ్ళు
గాజుమదిని నమ్మడం తప్పని తెలిపాయి గాయాలు
ఇంకెన్ని కోరికలు కలలను కప్పెడతానో తెలియదు
కానీ పుట్టిపోయేది వట్టిచేతులతో అంటారు లోకులు!

నన్ను ఎవరో తలచుకుంటున్నారని చెప్పె వెక్కిళ్ళు
కొత్తగాలి తెచ్చేను కబురని తెరచి ఉంచాను కిటికీలు
నవ్వి ఆహ్వానిస్తుంది వేడుకో వ్యధో అర్థంకావడంలేదు
జీవితానికి తర్ఫీదుఇస్తున్నా ఒకటేనని వెలుగునీడలు!

చెవిటి మనసుఘోష చేస్తుంది గులకరాళ్ళ చప్పుళ్ళు 
నిండుగా తమ పాత్రని పోషిస్తూ అలసినాయి బాధలు
ఆనందమా నువ్వు నీ పాత్రని ఎలా పోషిస్తావో తెలీదు
అప్పుడప్పుడూ వచ్చి ఇచ్చిపోరాదా కొన్ని సంతోషాలు! 

34 comments:

  1. సంతోషాలని వచ్చి సంబరాలు చేయమంటూ మీరు పంపిన ఆహ్వానం అందుకుని త్వరగా రావాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete


  2. అయ్యో రామ ! ఎప్పుడు చూసినా ఎద రొద సద లే నా :)



    ఎప్పుడు చూసిన మదిరొద
    చప్పుళ్లేనా జిలేబి! చక్కని చుక్కా !
    రొప్పుచు రోజుడు ధుమధుమ !
    గప్పున విడువుము శుభాంగి కావ్య కుమారీ !

    జిలేబి

    ReplyDelete
  3. మది రోదన కావ్యంగా ఆహా ఓహో కానీ మనకీ మనవారికీ అమ్మో అబ్బో వద్దే వద్దు..

    ReplyDelete
  4. మది రుదిరమై కన్నీరు ఎరుపెక్కినా...
    శ్వేత వర్ణపు మందహాసపు ముసుగే జీవితమౌనా

    ReplyDelete
  5. జీవితంలో సుఖదుఃఖాలు వెలుగునీడల వంటివని మీరే రాసినారు.

    ReplyDelete
  6. why sad?
    navvutoo bharata kali

    ReplyDelete
  7. గడచినదే తలచుకుని విచారించి లాభంలేదండీ
    జీవితం అంటేనే వ్యధలు వేదనలు వాటితోపాటు ఆనందాలు నవ్వులు అన్నీ వాటి సమయం వచ్చినప్పుడు పాత్రలు సక్రమంగా పోషిస్తాయి. మనం నిమిత్తమాత్రులం అంతే!

    ReplyDelete
  8. కష్టసుఖాలని వాస్తవిక దృక్పథంతో ఆలోచించడం కష్టమే ఎందుకంటే వాస్తవాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం అందరికీ ఉండదు. కవిత వేదనతో కూడినా బాగుంది మీరు పదాలని పేర్చి వ్రాసిన తీరు.

    ReplyDelete
  9. నీకేల ఇంత నిరాశ
    నీ కన్నులలో కన్నీరేల
    అంతా దేవుని లీల
    నీ మదిలోని వేదనలన్నీ
    నిలువవులే కలకాలం
    వాడిన మోడు పూయకమానదు
    వచ్చును వసంత కాలం
    ఆశనిరాశలు దాగుడుమూతల
    ఆటేలే ఈ లోకం ఆటేలే ఈ లోకం
    కష్టసుఖాల కలయికలోనే
    ఉన్నదిలే మాధుర్యం జీవిత మాధుర్యం

    ReplyDelete
  10. ఆశనిరాశల మధ్య అభివృద్ధిని వారధిగా నిర్మించుకుంటే ఆవేదనకు తావుండదు. ఆవేదన చెంది ఆవేశంతో పోటెత్తించుకోవడం ఎందుకు. అనుభవాల నుండి పాటం నేర్చుకుని చూస్తే జీవితం ప్రతికోణంలోనూ అవగతమవుతోంది-హరినాధ్

    ReplyDelete
  11. మనిషై పుట్టినాక మదిరొద తప్పదు.

    ReplyDelete
  12. నమ్మకం మోసపోయినప్పుడు కలిగే మానసిక వేదన ఎప్పటికి సమసిపోదు. మనసు భరించలేక పోతోంది జ్ఞాపకాల ఉలి దెబ్బలని, అలా రాలిపడ్డ ఆశలే గమ్యం చేరేలోగా చిగురించి మరో దారి చూపుతుంది.

    ReplyDelete
  13. వేదనలు అక్షరాలుగా బయట పడినట్లున్నాయి మది అగాధాన్ని తవ్వుకుంటూ మీ కవితలో.

    ReplyDelete
  14. వేరొకరిది మోసం ఆ పైన విరహం యెంతసేపు యివే కధలు అందరీ ఇవే వ్యధలు అనుకుంటే ఎలా? మనలో లోపం దాగి ఉన్నప్పుడే మనం బాధపడతాము అనిపిస్తుంది నాకు.

    ReplyDelete
    Replies
    1. భలే చెప్పారండీ....ఎవరైనా మోసం చేసారు అని ఏడ్చి చచ్చేవాళ్ళంటే బోల్డంత కోపం వస్తుంది నాకు...మగాడితో సమానంగా ఉండాలనుకుంటారు మగాడిలాగా ఉండాలని కోరుకోరు. ఏ మగాడైనా నేను నమ్మిన ఆడది నన్ను మోసం చేసిందీ, నాకు భరణం కావాలీ, ఆస్థి కావాలీ అని ఏడుస్తున్నాడా ? ఆడవాళ్ళకే ఎక్కడలేని ఏడుపులూ :(((

      Delete
    2. నీహారికగారు ఎవరైనా మనల్ని మోసం చేసారు అంటే ఇక్కడ మోసపోయింది మగ అయినా ఆడయినా అది వారి అతి మంచితనమో లేక చేతకానితనమో అయ్యిఉంటుంది. జరిగిన దానికి వేదనపడక బయటపడే మార్గంలో ధృఢసంకల్పంతో పయనించాలి అంతేకానీ ఏడ్చి నిరాశతో ఏం సాధిస్తాము.

      Delete
    3. "నా రక్తంతోనే తడిసారి ఎర్రబడ్డాయి నా చేతివేళ్ళు"
      అనే వాక్యం ఆ తిరుగుబాటునే సూచిస్తుందనుకుంటాను!
      {పద్మార్పిత గారు చెప్పాలి}
      అన్ని మోసాలూ మన అమాయకత్వం వల్లనే జరగవు లెండి.
      కొందరు ఇతర్ల కష్టాన్ని దోచుకుని బతకాలని శపధం పట్టి ఉన్నారు - నిజం!
      అన్ని ఏడుపులూ కూడా ఒకటి కాదు.
      ఆడకష్టాలు ఆడవాళ్ళవి.
      మగకష్టాలు మగవాళ్ళవి.
      బార్లు మగవాళ్ళకి:-)
      పబ్బులు ఆడవాళ్ళకి:-(

      Delete
    4. హరిబాబుగారు...తిరుగుబాటు ఎందుకండీ
      ఎవరి దారి వారిది...బార్లకి వాళ్ళు పబ్బులకు వీళ్ళు
      మీరు చెబితే కాదంటామా... :) :) :)

      Delete
  15. మనసులోని భావాలు ఎన్నో
    మరువలేని గాయాలు ఎన్నెన్నో..
    మనిషికి మార్పు సహజం
    జీవితంలో మరువలేనివి ఇంకెన్నో
    ఇదే జీవితం...అనుభవించు అనుక్షణం

    ReplyDelete
  16. ప్రతీ మదికి ఒక కధ
    దానికి ఎన్నెన్నో వ్యధలు
    కధ మారదు వ్యధ తీరదు
    గాయం అయితే నొప్పి
    గుండె పగిలితే కన్నీరు వస్తుంది
    జీవితమంటే కష్టం రాకుండా ఉండదు
    సుఖం వచ్చి కష్టాన్ని చెరుపుతుంది
    అంతవరకూ వేచిచూడక తప్పదు..

    ReplyDelete
  17. వ్యధ చెందితే మనసు కొల్లేరు అవుతుంది.

    ReplyDelete
  18. వర్ణన బాగుంది అనుకుందామంటే వ్యధలు వదలవు ఎప్పటికీ...హ హ హా

    ReplyDelete
  19. ఎవరి బాధ వారిది.
    కొంత మంది బాగుపడుతుంటే ఓర్వ లేక నవ్వు నటిస్తు నట్టేట ముంచి ఏడ్చే రకం.. ఇంకొంత మంది మా కంటే ఎదిగిపోతారని తెలిసి ఎలా ఐన వారి ప్రమేయం ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తు ఎదుటివారికి ఇబ్బంది కలిగితే లోలోపల ఆనందిస్తూనే పైకి ఏడుపు నటించే రకం.. అసలు సిసలైన బాధను బాధగా సంతోషాన్ని సంతోషంగా స్వీకరించేవారు ఒక్క తల్లిదండ్రులే వారి తర్వాత భార్యకు భర్త భర్త కు భార్య.. తక్కిన వారు మొసలి కన్నీళ్ళు నటిస్తు ఆ కుతంత్రపు కన్నీళ్ళ కుంటలో ఇతరులను తోసి లోలోపల దాస్టిక ఆనందాన్ని పొందుతారని నా అభిప్రాయం పద్మ గారు.

    తెలుగు మహసభ శుభాభినందనలతో

    ReplyDelete
  20. ఎండిన బీడులాయే గుండెలు, కురవని మేఘాలు అయినవి కళ్ళు, వేసవి గాలులే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు...ఇంక తప్పక శోకసాగరం అయ్యెను మనసు అంటారా.

    ReplyDelete
  21. మనసు చెందే వేదన తీర్చడం ఎవరితరం మేడమ్.

    ReplyDelete
  22. This comment has been removed by the author.

    ReplyDelete
  23. వేదనతో అయితే భావం పొంగును అని రుజువు చేశారు ఈ కవిత ద్వారా

    ReplyDelete
  24. వేదనతో రగిలిపోయే వారికి ఎప్పటికీ నిద్రలేని రాత్రులే మిగులుతాయి.

    ReplyDelete
  25. ఇలా ఎంకెన్నాళ్ళు మదిరోదన పద్మార్పితజీ

    ReplyDelete
  26. నిండుగా తమ పాత్రని పోషిస్తూ అలసినాయి బాధలు
    ఆనందమా నువ్వు నీ పాత్రని ఎలా పోషిస్తావో తెలీదు..Nice

    ReplyDelete
  27. ఆక్షరాభిమానులు అందరికీ నమోఃవందనములు _/\_

    ReplyDelete