ఏదో చేసిపో..

నీ అచ్చట్లు ముచ్చట్లు కరువైనాయంటూ 
ఎద ఎగిరెగిరి ఆగలేక కొట్టుకుంటుందయ్యో
ఏడనున్నా వచ్చి సందిట్లో సవ్వడే చేసిపో!

నీ సురుక్కు చూపులే నన్ను కానలేదంటూ 
నల్లమబ్బు కాటుకెట్టిన కళ్ళు మండెనయ్యో
వరదలా వడివడిగా వచ్చి నన్ను వాటేసుకో!

నీ లేత ముళ్ళ మీసాలు చెవి నిమరలేదంటూ
రవిక బిగువై రాగాలు శృతి తప్పి పాడెనయ్యో
పరువపు శంఖాన్ని తమకమే తగ్గేలా ఊదిపో!

నీ తుంటరి సైగలు కసితో కవ్వించ లేదంటూ
నారుమల్ల చీర నడుముజారి గోలచేసెనయ్యో
బుట్టెడు మల్లెలతో వచ్చి బాగా బుజ్జగించుకో!

నీ బెరుకుతనమేదో బిడియాన్ని బంధించెనంటూ
పెదవులే విరహవయ్యారంతో వంపు తిరిగెనయ్యో
మదనుడి కైవసపు మంత్రాలు వచ్చి వల్లించిపో! 

27 comments:



  1. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో :(


    తమకంబే తగ్గేలా
    ఘుమఘుమ లాడించ వయ్య గుమ్మను నేడే !
    గమకంలో మైకముతో
    నిమిషంబే యుగముగాను నెచ్చెలి వేచెన్ !


    చీర్సు సహిత
    జిలేబి

    ReplyDelete
  2. కొంటెగా అమాయకంగా ఆతృతగా ఎదురు చూపులు
    మీ కవితాక్షర చిత్రము పలికే భావము..!

    చురకత్తిలా చుపులతో చూసినా
    ఒక్కోసారి మాటరాక మూగబోయినా
    ఊసుపోక గుండె లయ తప్పినా
    ఏ దారి వెంబడి ఉరుకులు పరుగులు పెట్టినా
    సివరాఖరికి నీతానే చేరవస్తిని కదా కోమలాంగి

    ఇంతకు మించి మీ ఈ కవితకు కమెంటలేకున్నాను పద్మ గారు.. హావభావాల లోగిలి మనసైతే ఆ మనసుకి కూసింత కలవరింత పలవరింత కలబోస్తే బహుశ అదే అలంకారమేమో ఆడవారి గొప్ప మనసుకి

    ~శ్రీ~
    దేదీప్యమానం జ్యోతిరాత్మ శివకేశవం

    ReplyDelete
  3. గోడెక్కి గోడు గోడున
    వేడెక్కిన తలపులాడి వేడికోలు - ఆ
    బోడెద్దుకు వినిపిస్తే
    కాడెత్తుక రయ్యి రయిన గబుకున రాడా .

    ReplyDelete
  4. అయ్యో అయ్యో అయ్యయ్యో...
    ఏమో ఏమో ఏదో అయినది, శృతి మించి రాగాన్న పడుతున్నది.

    ReplyDelete
  5. మీరు అసాధ్యులు సుమా!

    ReplyDelete
  6. ప్రణయాక్షర నీరాజనం
    కమనీయభావ విన్యాసం
    వలపువీణల రాగరంజితం
    సరసశృంగార పద్మార్పితం

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. చూపులకు అమాయకత్వానికి అద్దంలా వుంది మీ నాయకి
    హృదయం పరిస్తే రతీ దేవికి హారతి నందించేట్టు వుంది

    ReplyDelete
  9. బెరుకుతనం ఎవరిది ఆమెదా అతనిదా?

    ReplyDelete
  10. ప్రణయం మహాప్రళయం సృష్టించిన దాఖలా కనబడుతున్నది మీ కవితల్లో....హ హ హా

    ReplyDelete
  11. బేరుకుతనం బిడియంని బంధించె... నిజమా(గొప్ప అనుభూతి)

    ReplyDelete
  12. రారమ్మని పిలవడం ఓకే
    వచ్చిపో ఏదో ఒకటి చేసుకో అనడమే ఇబ్బంది
    ఎంతైనా ప్రియుడాయే 😁

    ReplyDelete
  13. ఎప్పుడూ ఏ అచ్చటాముచ్చటా లేదంటూ ఆడవారు ఆడిపోసుకునే అమాయకులైన మగవారినే కదా?

    ReplyDelete
  14. Fantastic lovely lyrics padmarpitagaru.

    ReplyDelete
  15. నారుమల్ల చీర నడుముజారి గోలచేసె....మీకే సొంతం ఇటువంటి పదాలు

    ReplyDelete
  16. శృంగారము రంగరించి రాసిన కవిత చిత్రము రెండూ బాగున్నవి.

    ReplyDelete
  17. పరిమళభరితం పదాలు
    అందులో దాగిన పరువపు రహస్యాలు.

    ReplyDelete
  18. పరువపు శంఖాన్ని పూరించి రవిక బిగువ రాగాలు వినవలసిందే అయితే. :)

    ReplyDelete

  19. శృంగారం కాస్త శృతిమించినట్లు ఉన్నది, చిత్రము అమాయకంగా చూస్తుంది...జాగ్రత్త అవకతవలు అయ్యేను.

    ReplyDelete
  20. మనసుకి చేయ్యలనిపించిన ప్రతి దాన్ని చేసెయ్యి అంటూ పరిమిషన్ ఇచ్చారు..

    ReplyDelete
  21. నన్నేదో సెయ్యమాకు నడుముకాడ
    సోకంతా దోచమాకు ఆడ ఈడ పాటవిన్నాము
    ఏదో చేసెయ్యి..పద్మార్పిత కవిత చదివాము ఈడ

    ReplyDelete
  22. ఏదో చెయ్యమని రెచ్చగొట్టకు
    సరిగంగ స్నానమంది మనసు
    పగటిపూట అలజడి రేపకు
    తుమ్మెద ముట్టని తేనె కోసం
    తుంటరి పెదవులని కదపకు
    దిక్కులు కలవని విరహాలను రేపి
    తీరని కోరికలతో గోలపెంచకు
    అలలై పొంగిన అందాలతో కైపెక్కించి
    గొంతు ఎండి ఊపిరిని ఆపకు..

    ReplyDelete
  23. Innocent face with lovely lines.

    ReplyDelete
  24. ఆ చూపుల్లో పడనివారు ఉండరు
    బాగుంది మీ కవిత

    ReplyDelete
  25. పసిడి కాంతులు ఆరబోసినట్లు అందాలు
    అలల వలె వచ్చిపోయే పడతి అలకలు
    కలల కలబోసిన కవ్వింపు కవితలు
    మైమరపించి మురిపించే పరిమళ పదాలు
    హాయితో అలరిచు అర్పిత వ్రాసేటి కావ్యాలు
    కనులకు ఎంతో ఇంపు రంగరించిన చిత్రాలు

    ReplyDelete
  26. ప్రణయ రాగాలు...పరువాల ముచ్చట్లు...మొత్తానికి ప్రేమ పరాగాలు వెదజల్లి జనుల్ని మత్తెక్కించారు మీ కవిత్వంతో.... అద్భుతం మేడం... సలామ్!!

    ReplyDelete
  27. అందరి ఆదరణాత్మక ప్రేమ వ్యాఖ్యలకు నా అభివందనం._/\_

    ReplyDelete