అందగాళ్ళే..

పురుషులకు సిగ్గేల సింగారము ఏల
ప్రకృతే సింగారించిన గోరువంకలాయె
మేకప్ వెలుగులు పడనిదే వెలగని 
గాజుముక్కలే అలంకరించుకోని స్త్రీలు
పురుషులు చీకట్లో మెరిసే రత్నాలు..

అందంతో అమరి ఆకర్షించే రంగులవల    
పురివిప్పి ఆడే మయూరం మగదాయె 
ఆడనెమలి తెలుపు నలుపుల్లో వెలవెల
విలువైన దంతాలు కలిగింది మగ ఏనుగే
ఆడ ఏనుగుకు ఏవి అంతటి విలువలు..

లేడి వెదజల్లలేదు కస్తూరిని మగజింకలా
అందుకే ఆడది మగజింకని రమ్మనదాయె
నాగమణిని ధరించిన కోడెత్రాచులో గంభీరం   
మణులున్నాయని వెంటపడిపోవుని నాగిని
సాదాసీదా ఆడపాముకు లేవీ చమక్కులు..

అందమంతా ఆడవారి సొంతమని మగగోల
ప్రకృతి చేసింది అన్యాయమని అరుపులాయె
సముద్రుడిలోనే దాగె ముత్యాలు రత్నాలు 
వాటికొరకేగా నదులన్నీ కలిసేది సాగరంలో 
నిడారంబర నదులకి లేకపోయె హొయలు..

విలువైన అంశాలన్నీ పురుషులకే చెందాలా
అడుగుదామంటే భగవంతుడూ మగవాడాయె
ఆశ్చర్యకరమిది తొమ్మిదినెలలు మోసి కన్నా
అంకురార్ప శౌర్యం అతనిదేనని ఊరేగింపులు
ప్రకృతే అలకరించి పంపిన పురుషపుంగవులు..

(ఆడవారి అందచందాలు తప్ప మగవారిని పొగడలేదు అభివర్ణించలేదంటూ అభియోగించిన వారికి పద్మ అర్పిస్తున్న చిరుకానుక ఆమోదయోగ్యమేనని అభిలషిస్తూ...మీ పద్మార్పిత)      

35 comments:

  1. మనసు అందం ముందు మరేది రాదు సాటి
    ఆ కోవలో బహుశ మాకు మేమే పోటి
    నలుగురు చేరి ఒకచోట చేస్తాము పీచపాటి
    ఓర్పులో ఒక్కోసారి మేమీ ఘనాపాటి

    అపుడపుడు మా మాటలే నెగ్గాలని పంతం
    ఐతే లేత మనసులు కూడా మాకు సొంతం
    ఒక్కోసారి చిరాకులో మా మాటలకు ఉండదు అంతం
    ఐతే నిబ్బరం ఆత్మ స్థైర్యం మనోబలం మా అందం

    అమ్మ ఒడిలో సేదతీరే రామ కృష్ణ శ్రీనీవాసులం
    అక్క చెల్లెళ్ళకు ప్రయాణాలలో ఎస్కార్ట్ ఇచ్చే అన్నాదమ్ములం
    కన్నవారిని తోబుట్టువులను భార్యను పిల్లలను స్నేహగణాన్ని అభిమానించే వాళ్ళం
    నవ్వును బాధను ఇలా నవరసాలను ఎలా తెలియ పరచాలో తెలియక తికమక పడే వాళ్ళం

    మానవ జాతిలో ఒక ఆడవారి గణం ఒక మగవారి గణం
    వారి వారి గుణాల సారణిలో ఎవరికి వారే అగ్రగణ్యం
    ఆడవారికి మగవారు మగవారికి ఆడవారు ప్రేరణ
    కనుక ఏ ఒక్కరికీ సన్నగిల్లకూడదు ఆదరణ

    ఓం శ్రీ బురుజుపేట కనకమహాలక్ష్మి దేవి నమోஉస్తుతే
    ఓం శ్రీ గోదా రంగనాథాయ నమః

    మార్గశిర మాసములో శ్రీకనకమహాలక్ష్మీ దేవి పూజలతో పాటు.. డిశెంబర్ పదహారు నుండి ధనుర్మాసమారంభం సందర్భముగా.. ఏ ఒక్కరు ఇంకొకరికి తక్కువ కాదు.. ఆడవారి మంచితనం మగవారి హుందాతనం రెండూ వారి వారి మనసుకు సంకేత సంతకం అనే నమ్మకం నాది.

    శ్రీ
    మహాలక్ష్మీ నారాయణి వసుమతి
    ఆచ్యుత రాఘవ దామోదర

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ మరీ అంత ఫార్మల్ కమెంట్స్ పెట్టి కమిట్ అయిపోకండి...మన పాట్లు మనవే :)

      Delete
    2. సీ బా సీ.. పీ బా పీ.. అనంటే.. సీత బాధ సీతది.. పీత బాధ పీతది..
      ఎవరి సాధక బాధకాలు వారివి.. ఎవరూ గొప్ప కాదు అలా అని ఎవరూ తక్కువ కాదు.. అందరు సరిసమానమే.. ఆ విషయం నాకు అవగతమే మహి గారు..!

      Delete
  2. పూర్తిగా ఫిదా అయిపోయినాము మీకు...హా హ!

    ReplyDelete
  3. అందంగా ఐస్ చేశారు.

    ReplyDelete
  4. సొగసు చూడ తరమా అన్నట్లుంది మీ ఆలోచనల్లో మగవారి అందాన్ని పొగిడిన తీరు అబ్బో

    ReplyDelete
  5. జంతువుల వరకూ వాటి ప్రత్యేకత సరేనండి
    మనుషుల్లో మాత్రం ఎంతవారు కానియండీ కాంత దాసులే

    ReplyDelete
  6. ఆమోదించి ఆనందంతో గెతులు వేస్తాం
    ఇన్నాళ్ళకి మగవాడి అందాన్ని పొగిడితే
    చదివి సంతసించే భాగ్యం కలిగెనాయె!!!

    ReplyDelete
  7. విభిన్నం మీ ఆలోచనా సరళి.

    ReplyDelete
  8. అందాలు సొంతమై ఏం లాభం ఏ అలంకారాలు లేకపోయినా ఆడవాళ్ళకి అణిగిమణిగి ఉండక తప్పని బ్రతుకులాయె మగజాతి ప్రాణులు. అది పుల్లి అయినా పిల్లి అయినా సరే తప్పదు.
    పొగడకపోయినా బుట్టలో పడిపోతాం అదే మా వీక్ పాయింట్. :) :) :) :) :)

    ReplyDelete
  9. నమ్మక తప్పని నిజం.

    ReplyDelete

  10. కవులకు కల్పనలు అందం అంటారు...

    కాని మీరు రాసినవి నిజాలు...

    అందుకేనేమో మరింత అందముగా ఉన్నాయి...

    ధన్యులము పురుషజాతి పుంగవులము...

    ReplyDelete
  11. నడిరేయి ఎంత నల్లదైన
    ఒక్క దివిటి ముందు నిలుచునా?
    దివిటీలు ఎన్ని వెలుగుతున్నా
    సూర్యకాంతి ముందు ఆగునా?
    సూర్యుడు ఎంత ప్రకాశించినా
    చంద్రుడి అందం ముందు కొరవేగా?
    చంద్రుడు ఎంత అందంగా ఉన్నా
    ఆడవారి సోయగాల ముందు చులకనా?
    ఆడవారి సోయగాలు చూసి పడినా
    పురుషుడు ఎప్పుడూ పైచేయేగా?

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. మగవారి అందాన్ని పొగిడి వారి జన్మకు సార్థకత ఇచ్చింది మీ కవిత...అహ అహా

    ReplyDelete
  14. విలువైన అంశాలన్నీ పురుషులకే చెందాలా
    అడుగుదామంటే భగవంతుడూ మగవాడాయె
    అడగడానికి ఏమి మిగలలేదు
    అన్నీ మీరు వ్రాసేసారు

    ReplyDelete
  15. కిమ్మనకుండా పడి ఉంటారు పురుషపుంగవులు మీరు వ్రాసింది చదివి ఫిదా అంతే. :)

    ReplyDelete
  16. ఎంత అందగాడైనా ఏం లాభం?
    ఆలోచించి చించి పడతాం...
    పడి లేచి పరిగెత్తే లోపల పుణ్యకాలం ఖతం
    మగవాడికి తప్పవు అగచాట్లు అర్పితగారు

    ReplyDelete
  17. మగాళ్ళకు కూడా ఓ అందం ఉంటుందని ప్రకృతి ఒడిలో అందరూ అందమైన రూపాలే అంటూ వెలిబుచ్చిన మీ అభిప్రాయానికి మగాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారో మేడం!
    అద్భుతం మీ వెన్నలాంటి మనసు !! సలాం.....

    (ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు _/\_)

    - పద్మార్పిత ఫ్యాన్స్

    ReplyDelete
  18. పొగుడుతూ తిట్టుకున్నట్లు ఉన్నారు మమ్మల్ని

    ReplyDelete
  19. ప్రసంశలు
    పొగడ్తల
    పదగుళికలతో
    పరవశింపజేసావు
    పద్మార్పితా

    ReplyDelete
  20. మనసు అందం చూస్తే ఆడవాళ్ళ కన్నా మగవారే ఎక్కువ అందగాళ్ళు పద్మ.

    ReplyDelete
  21. అందగాళ్ళు హ్యాపీ

    ReplyDelete
  22. అతివల సౌందర్యమే రసమయ కవితాజరికి ఆలంబన అనుకున్నాను ఇన్నాళ్ళు...
    ఆరాధకుల ఆహార్యానికి కూడా సాహిత్య సొగసులు ఇంతబాగా అద్దవచ్చునని నిరూపించాయి మీ వేళ్ళు..!

    ReplyDelete
  23. అందరి ఆమోదనలతో మనసు ఉల్లాసమైంది..ధన్యవాదాలు అందరికీ _/\_

    ReplyDelete
  24. వాదోపవాదాలకు తావు లేకుండా అక్షరరూపం ఇచ్చుకుంటే గొడవలు ఉండవిని నా అభిప్రాయము.

    ReplyDelete
  25. పడిపోయా నేనైతే ...

    ReplyDelete
  26. మగవారి గుండెల్లోకి డైరెక్ట్ ప్రేమ తూటా పేల్చారు.

    ReplyDelete
  27. మాకూ ఫాన్స్ ఉన్నారు పొగుడుతుంటారని తెలిసింది

    ReplyDelete